Thursday, August 16, 2007

నా జీవితమును మార్చిన రెండు సలహాలు

ఆ కనిపించని భగవంతుడు, తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురుదేవులు, వీరు అందరు మన జీవన గమనము లొ వివిద స్తాయిలలో మన అందరిని తీర్చి దిద్దిన వారే, వారు మన నుంచి ఒక్క ప్రేమ అనే ప్రతిపలం తప్ప ఇంక దేనిని ఆశించనివారు, ఆశించరు కూడా.
నాకు విద్యా బుద్దులు నేర్పిన, నా గురువర్యుల అందరి పేర్లు ఇక్కడ చెప్పటము సాద్యము కాదు కాబట్టి, ముందుగా వారి అందరికి పేరు పేరున పాదాభివందనములు సమర్పించుకొంటున్నాను . నేను ఈరోజు ఇలా వుండటానికి సరైన సమయము లో, సరైన సలహాలు ఇచ్చిన, శ్రీనివాసరావు మాస్ట్టరు, ఆంజనేయ మాస్ట్టరు గురించి రెండు పరిచయ వాక్యాలు చెప్పి, వారి సలహాలు నాకు ఎ విదముగా ఉపయొగపడినది చెప్పుతాను.
శ్రీనివాసరావు మాస్టరు మాకు పదివ తరగతి లొ మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పెవారు. వారు ఎంత క్లిస్టమైన లెక్క నైనా చాలా బాగా విడమరిచి అందరకి అర్ఢము అయ్యెటట్టు చెప్పెవారు. నేను పదివ తరగతి కి వచ్చినప్పుడు (a+b)2 ఫార్ములా కూడా తెలియదు, అలాంటి నన్ను ఆ సబ్జక్టు లొ మంచి ప్రావిన్యము వచ్చెటట్టు చేసినారు, అది నాకు ఆ తరువాత చదువులకు పునాది అవినది.
పదివ తరగతి చివరి పరిక్ష వ్రాసిన తరువాత , ఆ రోజు రాత్రి మా స్కూలు లొ సినిమాలు వేస్తాము, రండి అంటే మేము అంతా వెల్లినాము. ఎ రా మాధవ్ సెలవులలో ఎమి చెయ్యాలను కొంటున్నావుచెప్పు అని శ్రీనివాసరావు సార్ అడిగినారు, ఏముంది సార్, పలితాలు రాగానే ఇంటర్ లొ చేరటమే కదా, ఇంక ఎమి చేస్తాం అని అన్నాను. అంటే సెలవులలో ఏమి చెయ్యవా అని మరల అడిగినారు, నేను మరలా ఇంతకు ముందు చెప్పిన సమాదానమే చెప్పినాను. అంతకన్నా నాకు ఇంక ఎమీ తెలియదు కాబట్టి.
అప్పుడు సార్ అన్నారు, ఎ. పి. ర్. జే. సి, పాలిటెక్నిక్ రెండు వున్నవి , కోచింగ్ తీసుకొని పాలిటెక్నిక్ పరిక్ష రాయి అని అన్నారు. అప్పటి వరకు నాకు అవి వున్నవి అని కూడా తెలియదు. నేను అలానే అని చెప్పి వచ్చినాను. ఆ తరువాత వారు చెప్పినట్టుగానె పాలిటెక్నిక్ లొ కాకుండా, ఎ. పి. ర్. జే. సి కోచింగ్ తీసుకొన్నాను శ్రీ నాగభైరవ జూనియర్ కాలెజి, ఒంగోలు లొ చేరినాను. ఆంద్రుల అందాల బిడ్డ ఎన్. టి. ర్ స్వగ్రామము నిమ్మకూరులో నాకు 2nd list lo seat వచ్చినది. కాని నెను అప్పటికే శ్రీ నాగభైరవ జూనియర్ కాలెజి లొ ఇంటెర్ లొ చేరివున్నాను, అందువల్ల నిమ్మకూరు వెల్లలేదు.
ఆ రోజు సార్ సలహ నాకు ఒక మంచి కాలేజి ని పరిచయము చేసినది, ఆ కాలేజి లొ తొలినాల్లలొ నేను ఇతరుల నుంచి నెర్చుకొన్నదే నా భవితకు చక్కని మార్గము చూపినది.
ఆంజనేయ మాస్ట్టరు మాకు కెమిస్ట్రి చెప్పే వారు. వారి కోరిక ఒకటి వున్నది, అది ఏమిటంటె అతని సబ్జెక్ట్ లొ 60/60 మార్క్స్ తెప్పియాలి అని. ఆ సార్ ద్రుష్టి లొ త్వరగానే పడినాను, ఎందుకు అంటే ఆ క్లాస్ లొ కొంచము మంచిగా చదువుతున్నాను. అప్పటి నుంచి నన్ను చాలా బాగా ప్రొత్సహిస్తుండేవారు. నేను ఫైనల్ పరిక్ష లొ 60/60 మార్క్స్ తెప్పిస్తే, ఒక జత బట్టలు, షు తీసిస్తను అని చెప్పినారు. కాని నేను దానిని సాదించలేక పొయినాను, నాకు 57/60 మార్క్స్ మాత్రమే వచ్చినవి మొదటి సమత్సరము లొ.
ఇంటర్ పరిక్షలు వ్రాసిన తరువాత,నేను శ్రీ గొబిందాంబికా కాలెజ్ లొ కోచింగ్ తీసుకొన్నాను, కాని నా ద్రుష్టి అంతా మ్యాథ్స్ లేక్చరర్ కావలి అని వుండేది, ఎందుకు అంటే , మా సార్లకి అందరికి 30000 పైనే నెలకు జీతము వుండేది. అందువల్ల నేను కోచింగ్ లొ ఏమీ చదవలేదు, అప్పటికి నాకు పది వేలు రాంకు వచినది, దాని తొ ఉచిత సీటు రాదు కాబట్టి,ఉచితము అవితేనే మా ఆర్దిక పరిస్తితి సహకరిస్తుంది. నెను డిగ్రీలొ చేరుదాము అని భాపట్ల కాలేజి లొ అప్పలై చెసినాను. సీటు వచ్చినది, కాలేజి లొ చెరుదాము అని ఇంటి దగ్గర బయలు దేరి ఒంగొలు బస్ స్తాండ్ కి వచ్చినను,వచ్చినాను, అక్కడె మా కెమిస్త్రి సార్ కనపడి, ఎక్కడికి వెలుతున్నవు అని అడిగినారు, నేను కద మొత్తము చెప్పినాను, అప్పుడు ఎందుకురా నీలాంటి మంచి విద్యార్దులు కూడా మాలా అవ్వాలి అని కోరుకుంటారు, ఇక్కడ లైఫ్ లో పెరుగుదల వుండదు ఏఅమి వుండదు అని 30 నిముసాలు నాకు అక్కడె క్లాస్ తీసుకొన్నారు, అంతే నేను అక్కడి నుంచి వెనకకు వచ్చినాను బాపట్ల వెల్లకుండా. ఆ తరువాత మా ఇంటి లొ ఈ విషయము మీద చాల సీను జరిగినది అనుకొండి. ఆ తరువాత నేను లాంగ్ టరము కోచింగ్ తీసుకొని ఇంజనీరింగ్ లొ చేరినాను .
ఎది ఏమైనప్పటకి ఆ రోజు ఆ సలహాను పాటించి వచ్చినాను కాబట్టి, ఆ తరువాత ఇంజనీరింగ్, యం.టక్ రెండూ చెయ్య గలిగాను.
ఇప్పుడు జీవితములొ మంచిగానే స్తిర పడినాను అని బావిస్తున్నాను.

3 comments:

వెంకట రమణ said...

మీ అనుభవాలు చాలా బాగా చెప్పారు. నేను కూడా ఇంటరు ఒంగోలులోనే( శ్రీవాణి కాలేజిలో) చదివా. తరవాత మీరు చేసిన రెండూ చేశాను :).

తల్లపనేని మాధవరావు said...

దన్యవాదములు రమణ గారు.

Naga said...

వారు చెప్పింది వినడం, ఆ తరువాత ఆచరించడం వల్ల ఎంత మంచి జరిగిందో కదా! కంగ్రాట్స్.