Wednesday, August 15, 2007

తిరుమల తిరుపతి వెంకటెశా !

తిరుమల తిరుపతి వెంకటెశా ! అని చూడగానే ఇది ఏదో ఆ తిరుమల వెంకటెశ్వర స్వామి గురుంచి అనుకోంటె మీరు పప్పు లొ కాలు పెట్టినట్టె. ఇది శ్రికాంత్, బ్రహ్మనందం కలిసి నటించిన సినిమా చూసేటప్పుడు జరిగిన సంగటన.
నేను ఆ రోజు మెస్స్ డబ్బులు కట్టటానికి Tirupati S B I నుంచి 2000 రూపాయలు తీసుకొన్నాను. ఆ తరువాత సినిమాకు వెల్లినాను, అదే పైన చెప్పిన దానికి. అక్కడ కొంత మంది నా స్నేహితులు కలిసినారు, వారితొ పిచ్చాపాటిగా మాటలాడుతూ , సినిమా టికెట్స్ తీసుకొని, ఒక పక్కగా నిలబడి మరలా కబూర్లు చెప్పుకొంటు వున్నము, అంత లొ Q- దగ్గర చిన్న గొడవ జరిగి, హాల్ మేనేజెమెంట్ ఎవరినొ కొట్టుతున్నారు, ఎదొ గొదవ అని మేము పట్టిచు కోలేదు. ఆ తరువాత కొద్దిసేపటకి ఒక అబ్బాయి మాద్దగ్గరకు వచ్చి జరిగినది చెప్పినాడు, అతను ఏవరొ కాదు , అతను కూడా మా కాల్లేజి అతనే, అతనినే వాల్లు కొట్టినది. అప్పుదు మేము అంతా వెళ్ళి హల్ వారితొ గొడవ పెట్టుకొన్నాము, మాకు అక్కడ సినిమా చూడటానికి వచ్చిన జనాలు కూడా సపొర్ట్ చెసినారు, ఆ గొడవ లొ మెము హల్ వారిలొ ఒకరిని కొట్టినము, ఆ తరువాత హల్ మేనేజెమెంట్ మాకు సారి చెప్పినారు, జరిగినదానికి. ఇంక అంతా సినిమా చూడటానికి లొనికి వెల్లినాము, సినిమ మద్యలొ జేబు మీద చెయ్యి వెస్తె, జేబు కాలిగా తగిలినది, అప్పుడు బయటకు వెల్లి వెతికినాను, ఏమి ప్రయొజనం, ఆ గొడవలొ ఏవరొ నా జేబు లొ దబ్బులు కొట్టెసినారు.
ఇక నేను ఎప్పుడన్న ఆ సంగటన మర్చిపొతానా, ఆ 2000 నా నెల కర్చులకి తీసుకొన్నవి.
అలాగె హేరాం సినిమా కి వెల్లినప్పుడు, టికెట్స్ తేవటానికి వెల్లినప్పుడు నా టైటాన్ వాచ్చి పొయినది.
ఎప్పుడు అయినా ఆ సినిమా పేరులు వింటె నాకు పట్టరాని నవ్వు వస్తుంది.

2 comments:

Srini said...

నవ్వు వస్తుందా లేక బాధగా ఉంటుందా? ఎందుకంటే మీ డబ్బులు, వాచీ పొయాయి కదా, సారీ ఏమి అనుకోకండి, ఏదో సరదాగా అన్నాను.

తల్లపనేని మాధవరావు said...

దన్యవాదములు శ్రీనివాస్ గారు, నాకు నిజము గానే నవ్వు వస్తుంది ఎందుకంటె ఆ రోజు లలో హీరొలు గా ఫీల్ అవి వున్నవి పోగొట్టుకున్నందుకు.