Monday, October 15, 2007

సహనా అందత్వ స్కూలు, బెంగులూరు

చాలా రోజుల తరువాత వచ్చిన ఆ అవకాశముకు, ఏగిరి గంతు వెయ్యాలి అనిపించినది, ఎందుకంటె ఈ నెల లో ఒక రెండు గంటలు సహనా అందత్వ స్కూలు లొ వాలంట్రి పని చెయ్యటానికి అవకాశము వచ్చినందుకు. మా కంపిని నుంచి ప్రతి రొజు ఇద్దరు సహనా అందత్వ స్కూలు లొ వాలంట్రి పని చెయ్యటానికి వెలతారు. అక్కడ మనము చెయ్యవలసిన పని ఏమిటి అంటె, మనము మనకి వచ్చిన భాష లో ఒక రెండు గంటలు చదవటము, అక్కడ అందవిద్యార్దు లు , మనము చదివిన దానిని విని బ్రెయిలి లిపి లోకి తర్జుమా చేసుకొంటారు. మనము చదివేటప్పుడు కామాలు, ఫులు స్టాపులు, బ్రాకెట్స్, న్యూ లైను , న్యు పారాగ్రఫ్, లాంటివి అన్ని చదవాలి, ఇక్కడె మనము కొంచము తప్పుచెస్తుంతాము, అంటె మరిచి పొతుంటాము వాటిని చదివెటప్పుడు, మరచి పొయినాను కూడా కొన్ని సందర్బాల లో.
బ్రెయిలి లిపి చాల అద్బుతముగా వుంటుంది, ఆ లిపి తెలిసినవారు మాత్రమె దానిని గురుతు పట్టగలరు, మిగతావారు ఆ పెపర్స్ చూసి చిత్తుకాగితాలుగా బావిస్తారు ఎందుకంటె ఆ లిపి మొత్తము మనము సూది తొ పెపర్ ను గుచితె ఎల రంద్రాలు పడతవో, అలా వుంటవి ఆ అక్షరాలు. ఆరంటే ఆరె కీ బటన్స్ తో మనము అన్ని బాషలను అక్షర బద్దము చెయ్యవచ్చు.
అయిదు రోజు ల క్రితము అక్కడకి వెల్లినాను,చాలా బాగా ఏంజాయ్ చెసినాను ఆ పని ని, మరలా అవకాసం వస్తె తప్పకుండా వెల్లాలి అని వున్నది.