Tuesday, August 14, 2007

మరో జన్మ


నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాసేటపుడు, మాకు చివరి పరిక్షకు 5 రోజు లు విరామం వచ్చినది. అప్పుడు స్నేహితులము అందరము కలసి కళ్యాణి రిజర్వాయరు కి వెల్లినాము. కొద్దిసేపు అందరము అటు ఇటు తిరిగినాము రిజర్వాయరు మీద .అప్పుదు డ్యాము లొ దాదాపు 860 అడుగుల నీళు వున్నవి. ఆ తరువాత స్నేహితులు కొంతమంధి డ్యాము ఒడ్దున ఒక వైపు జలకాలు, ఈత కొట్టటాలు మొదలు పెట్టినారు, నాకు ఈత రాదు కాభట్టి నెను ఒడ్డున కూర్చున్నాను అందరిని తిలకిస్తున్నాను. కొంత సమయము తరువాత నా స్నేహితులు లొ ఒకరు వచ్చి నన్ను కూడా నీళ్ల లోనికి రమ్మని, నన్ను చెయ్యి పట్టుకొని వెలుతున్నాడు, నేను అతనిని వదిలించుకొని దూరముగా రొడ్దు పైకి పరిగెత్తినాను, కాని అతను నన్ను వెంభడించి పట్టుకొని,నీళ్ల లోనికి తీసుకొని పొయినాడు,షర్ట్, పాంటు విప్పి రమ్మన్నాడు, కాని నేను షర్ట్ పాంటు తోనే నీళ్ల లోనికి వెల్లినాను. వెల్లిన తరువాత చలాసేపు బాగానే గడిచినది. ఒక సారి అనుకొకుండా కాలు జారినది, నేను నీళ్ల లొ పడినాను, అప్పుడు నాకు ఎక్కడి లేని భయము వచ్చినది, ఆ భయము లొ నా కాల్లు కింద ఆనటము లేదు, స్నేహితులు ఏవరిపని లొ వాల్లు ఎంజయ్ చెస్తున్నారు, ఏవరు నన్ను చూడలెదు, చాలా సార్లు పైకి లేద్దాము అని ప్రయత్నిచాను, ఆ భయము వాల్ల నేను నా కాల్లు క్రింద పెట్ట లేక పొయినాను, అప్పటికే నీళ్లు త్రాగినాను, చివరి సారిగా మరలా ప్రయత్నించాను, అప్పుదు నా కొన వేల్లు మాత్రమే బయటకి కనపడినవి, అప్పుడు సునీల్ అనే నా స్నేహితుడు చూసి, అతను వచ్చి నన్ను పట్తుకొన్నాడు, ఆ భయము మీద నేను అతనిని గట్తిగా నా రెండు చెతులతొ పట్తుకొన్నాను, అందువల్ల అతనికి ఈత కొట్టటము సాద్యపడలెదు. అతను కూడా నాతొ పాతే నీల్ల లొనికి వస్తున్నాడు, అప్పుడు ఇంకొక స్నేహితుదు లక్ష్మి కాంత్ వచ్చి నన్ను పట్టుకొన్నాడు,ఆ భయము మీద నేను అతనిని కూడ గట్టిగా పట్తుకొన్నాను, అప్పుడు మేము ముగ్గురము నీల్ల లొనికి వెల్లుతున్నాము, అప్పుదు చంద్రశెఖర్ రెడ్ది అనె ఇంకొక స్నేహితుడు ఈత కొట్టు కొంటు మా వెనకాలకి వెల్లి నా షర్ట్ కాలర్ పట్టుకొని ముందుకు నెట్టినాడు. మిగతా స్నేహితులు గొలుసు లా ఏర్పడి మమ్మలని పట్టుకొన్నారు, ఆ తరువాత నీల్లు కక్కిచినారు.
నిజము గా నాకిది పునర్జన్మ లాంటిదె. ఆ రోజు నాకు ప్రానదానము చేసిన సునీల్,లక్ష్మి కాంత్,చంద్రశెఖర్ రెడ్ది ల సహాయము మరువలేనిది. మిమ్ము మరవను మిత్రులారా, దన్యవాదములు. ఆ షర్ట్ ని ఇప్పుటకి కూడా చాలా భద్రముగా దాచిపెట్టినా ను.
తల్లపనేని మాధవరావు

3 comments:

Lavanya said...

Mee blog bagundandi.
naa blog konchem mee lage untundi, nenu 3 days back start chesanu.
Idea is good.

visit my blog at http://yourslavanya.blogspot.com

and give me some suggestions also.

chandra sekhar said...

I am very glad to see and remember our colleage days.
i am lucky to have a friend like you.

తల్లపనేని మాధవరావు said...

దన్యవాదములు లావణ్య మరియు చంద్రశేకర్ గారికి, ఎదో నాకు గురుతు వున్నంత వరకు మీతో పంచుకొన్నాను.