Tuesday, August 14, 2007
భయము అంటే తెలిసిన రాత్రి
నేను ఐంజనీరింగ్ చదివే రోజులలొ, చాలా ఎక్కువగా సినిమాలు చూసేవాడిని.నేను ఫ్రెండ్స్ తొ కలసి నరసింగాపురం లొ నివసించే వాడిని.ఆ గ్రామము లొ మేము ఒకటిన్నర సమస్త్థరములు నివసించినాము.నరసింగాపురం గ్రామం తిరుపతి కి 13 కిలొమీటర్లు దూరం లొ వుంటుంది. నరసింగాపురం గ్రామం నుంచి మా కాలేజి 3 కిలొమీటర్లు దూరం వుంటుంది. నరసింగాపురం కు రెండు మార్గలలొ చేరుకొవచ్చు. ఒకటి, మదనపల్లి రూట్ లొ వయా శ్రీనివాసమంగపురం మీదగా, ఇంకొకటి చిత్తూరు రూట్ లొ వయా చంద్రగిరి మీదగా.చంద్రగిరి నుండి నరసింగపురం కి 2 కిలొమీటర్లు వుంటుంది. ఈ మార్గమద్యము లొ సువర్ణముఖి నది పాయను, ఒక స్మశానము ను దాటి రావలియును.రాత్రి సెకండ్ షో సినిమా చుసినతరువాత నరసింగాపురం కి బసు సదుపాయం వుండదు అందువల్ల మేము చంద్రగిరి కి వచ్చి అక్కడి నుంచి మా రూం కి వెల్లేవాల్లము. ఆ మార్గము లొ మెము రాత్రిపూట చలా సారులు ప్రయానించాము, అలాగే నేను ఒక్కడిని కూడా,నేను ఏరోజు భయపడలెదు. ఎప్పటి లాగే ఒకరోజు సినిమా చూసి నేను ఒంటరిగా బయలుదెరినాను తిరుపతి నుంచి. చంద్రగిరి నుంచి ఆ రాత్రి వేల కాలి నడకన బయలుదేరినాను, సరీగా నది మద్యలొ నాలో భయము మొదలు అవినది ఎందువల్లనంటే కొంథదూరం లొ ఏదో తెల్లని ఆకారము మెరుస్తూవున్నది ,నదిని అనుకొనే రొడ్డుకు రెండు వైపుల శ్మసానము వున్నది . నా మనస్సులొ అప్పుడు ఎక్కడ లేని భయము మొదలు అవినది,అది ఎలంటి ది అంటే ఒక్క క్షనము లొ గుండె అగి పొయెటంత. వల్లు అంతా చమటలు పొసినవి, అదుగు ముందుకు పడటం లెదు,ఆ క్షనం ఏమి చెయ్యాలో ఏమి అర్దము కాలెదు, అలనె అక్కడె నిలబడి, అంజనేయ స్వామి ని తలుచుకొంటు, దాదాపు 20 నిముసాలు వున్నాను. అప్పుడు కొంచము స్థిమిథం గా ఆలొచించినాను, ఇప్పుడు నది మద్యలో వున్నాను, వెనకకు మరలి వెల్లదాము అనుకొన్నా ఆ ఆకారము రాక పోదు మన వెనకాల, ఎది అవితె అది అవుతుంది ముందుకు వెల్లతాను, ఆ భగవంతుదు వున్నాడు అని, ముందుకు భయలుదేరినాను. తీరా ఆ ఆకారం వున్న ప్రదెసం దగ్గరి కి వెల్లితే, అది ఆకారం కదు, ఒక భండకు తెల్ల కలర్ వెసి వున్నది, అప్పుడు కాని నా భయము తగ్గినది, ఆ భండను పగటిపూట చాలసార్లు చుసినాను కాని ఎరోజు అంతగ చుడలెదు దనికి ఎ కలరు వున్నది అని. నిజముగ ఆ రోజు రాత్రిని నేను జీవితం లొ మరువలెను. ఆ రోజు ఆ భగవతుడి దయ వల్ల నా గుండె ఆగలెదు కాభట్టీ అది నాకు ఒక మరుపురని రొజు కాదంటార !.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
మీ అనుభవం అందరికీ ఓ మంచి పాఠం. పంచతంత్రంలో ఇలాంటిదే ఓక కథ ఉంది.
దన్యవాదములు నవీన్ గారు, ఎదో నాకు గురుతు వున్నంత వరకు మీతో పంచుకొన్నాను.
Post a Comment