Monday, October 15, 2007

సహనా అందత్వ స్కూలు, బెంగులూరు

చాలా రోజుల తరువాత వచ్చిన ఆ అవకాశముకు, ఏగిరి గంతు వెయ్యాలి అనిపించినది, ఎందుకంటె ఈ నెల లో ఒక రెండు గంటలు సహనా అందత్వ స్కూలు లొ వాలంట్రి పని చెయ్యటానికి అవకాశము వచ్చినందుకు. మా కంపిని నుంచి ప్రతి రొజు ఇద్దరు సహనా అందత్వ స్కూలు లొ వాలంట్రి పని చెయ్యటానికి వెలతారు. అక్కడ మనము చెయ్యవలసిన పని ఏమిటి అంటె, మనము మనకి వచ్చిన భాష లో ఒక రెండు గంటలు చదవటము, అక్కడ అందవిద్యార్దు లు , మనము చదివిన దానిని విని బ్రెయిలి లిపి లోకి తర్జుమా చేసుకొంటారు. మనము చదివేటప్పుడు కామాలు, ఫులు స్టాపులు, బ్రాకెట్స్, న్యూ లైను , న్యు పారాగ్రఫ్, లాంటివి అన్ని చదవాలి, ఇక్కడె మనము కొంచము తప్పుచెస్తుంతాము, అంటె మరిచి పొతుంటాము వాటిని చదివెటప్పుడు, మరచి పొయినాను కూడా కొన్ని సందర్బాల లో.
బ్రెయిలి లిపి చాల అద్బుతముగా వుంటుంది, ఆ లిపి తెలిసినవారు మాత్రమె దానిని గురుతు పట్టగలరు, మిగతావారు ఆ పెపర్స్ చూసి చిత్తుకాగితాలుగా బావిస్తారు ఎందుకంటె ఆ లిపి మొత్తము మనము సూది తొ పెపర్ ను గుచితె ఎల రంద్రాలు పడతవో, అలా వుంటవి ఆ అక్షరాలు. ఆరంటే ఆరె కీ బటన్స్ తో మనము అన్ని బాషలను అక్షర బద్దము చెయ్యవచ్చు.
అయిదు రోజు ల క్రితము అక్కడకి వెల్లినాను,చాలా బాగా ఏంజాయ్ చెసినాను ఆ పని ని, మరలా అవకాసం వస్తె తప్పకుండా వెల్లాలి అని వున్నది.

Thursday, September 13, 2007

మన మంత్రిగారు

ఈ మధ్య మన రాష్ట్రం లో రోజు జరిగే సంగటనలు చూసినప్పుడు, నా ఫ్రెండ్ ఒకరు పిచ్చాపాటి కబురులలో, ఒకసారి ఒక జొకు చెప్పినాడు, ఆ జొకు కచ్చితముగా మన రాష్ట్రము కు సరిపోతుంది.
అది ఏమిటి అంటే,
ఒకసారి మన మంత్రి ఎవరో ఒకరు విదెశి పర్యటనకు వెల్లినాడు, అతని చివరి రోజు పర్యటనలొ , ఆ దేశ మంత్రి గారు మన మంత్రి గారిని వారి ఇంటికి బొజనానికి పిలిచినారు, మనమంత్రి గారు తప్పకుండా వస్తాం అని చెప్పి వెల్లినారు, బొజనాది కార్యక్రమములు అవిన తరువాత, ఆ దేశ మంత్రి గారు మన మంత్రి గారిని తీసుకొని అతని ఇల్లు మొత్తం చూపిస్తు, మేడ మీదకి వెల్లినారు, అప్పుడు మన మంత్రి గారు ఈ ఇల్లు ప్రబుత్వం ఇచ్చినదా మీకు అని అడిగినారు, లెదు నా కష్టార్జితం అని చెప్పినారు ఆ మంత్రి గారు, మన మంత్రి గారికి ఇప్పుడు మరికొన్ని సందేహాలు వచ్చినవి, మీకు ఎవైన వ్యాపారాలు వున్నవ అని అడిగినారు, లెవు అన్నరు ఆ మంత్రి గారు , మరి ఎ వ్యాపారాలు లేకుండా ఇంత పెద్ద ఇంటిని ఎలా కటినారు అని అడిగినారు మన మంత్రి గారు, అప్పుడు ఆ మంత్రి గారు, అటు చూడండి అక్కడ బ్రిడ్జ్ కనపడుతున్నదా, ఇటు పక్క పారిశ్రామిక జొను వున్నది కదా, ఇలాంటి పనులు నుంచి నేను 5 శాతము నా వాటాగా తీసుకొంటాను, వాటితొటే ఈ ఇల్లు కట్టించ్చినాను అని చెప్పినారు. మన మంత్రి గారు బాగా ఊకొట్టి వచ్చినారు.
ఆ తరువాత ఒకసారి ఆదేశ మంత్రి అదే మన మంత్రి గారికి ఆతిద్యము ఇచ్చినవారు మన దేశము వచ్చినారు, అప్పుడు మన మంత్రి గారు వారి ఇంటికి ఆహ్వనించినారు, బొజనాది కార్యక్రమములు అవిన తరువాత, మన మంత్రి గారు ఆ దేశ మంత్రి గారిని తీసుకొని అతని ఇల్లు మొత్తం చూపిస్తు, మేడ మీదకి వెల్లినారు, అప్పుడు ఆ దేశ మంత్రి గారు ఈ ఇల్లు ప్రబుత్వం ఇచ్చినదా మీకు అని అడిగినారు, లెదు నా కష్టార్జితం అని చెప్పినారు మన మంత్రి గారు, మన మంత్రి గారి లాగే ఆ దేశ మంత్రి గారికి ఇప్పుడు మరికొన్ని సందేహాలు వచ్చినవి, మీకు ఎవైన వ్యాపారాలు వున్నవ అని అడిగినారు, లెవు అన్నరు ఆ మంత్రి గారు , మరి ఎ వ్యాపారాలు లేకుండా ఇంత పెద్ద ఇంటిని ఎలా కటినారు అని అడిగినారు మన మంత్రి గారిని, అప్పుడు మన మంత్రి గారు, అటు చూడండి అక్కడ బ్రిడ్జ్ కనపడుతున్నదా అని అడిగినారు, లెదు అని జవాబిచ్చినారు ఆదేశ మంత్రి గారు, అప్పుడు మన మంత్రి గారు చెప్పినారు, నిజము గానె అక్కడ బ్రిడ్జ్ వున్నది పేపెర్స్ లొ కాని 100 శాతము డబ్బులు నేనే తీసుకొన్నను ఫేపెర్లో బ్రిడ్జ్ కట్టి అని చెప్పినారు, విస్తుపొయిన ఆ దేశ మంత్రిగారు, బాగా అబివ్రుదిచెస్తున్నారు మీరు మీ రాష్ట్రాన్ని అని కితాబు ఇచ్చి వెల్లినారు, ఆ కితాబుకి మన మంత్రిగారు మురిసిపొయినారు.

Wednesday, September 12, 2007

Shame on Indian Media

A MUST READ...
Dear Editors of News Paers and TV channels, I got the mail below from a friend of mine and following the unwritten code of conduct, I am forwarding it to my friends but all efforts of people who have been forwarding this mail would go waste if this mail doesn't reach YOU...... Something to think about॥!!

Shame on Indian Media??? Really what a shame...By the time u guys read this news, the body of Major Manish Pitambare, who was shot dead at Anantnag, would have been cremated with full military ।
On Tuesday, this news swept across all the news channels 'Sanjay Dutt relieved by court'। 'Sirf Munna not a bhai' '13 saal ka vanvaas khatam' 'although found guilty for possession of armory, Sanjay can breath sigh of relief as all the TADA charges against him are withdrawn' Then many personalities like Salman Khan said 'He is a good person। We knew he will come out clean'। Mr Big B said "Dutt's family and our family have relations for years he's a good kid। He is like elder brother to Abhishek". His sister Priya Dutt said "we can sleep well tonight. It's a great relief
In other news, Parliament was mad at Indian team for performing bad; Greg Chappell said something; Shah Rukh Khan replaces Amitabh in KBC and other such stuff। But most of the emphasis was given on Sanjay Dutt's "phoenix like" comeback from the ashes of terrorist charges। Surfing through the channels, one news on BBC startled me. It read "Hisbul Mujahidin's most wanted terrorist 'Sohel Faisal' killed in Anantnag , India . Indian Major leading the operation lost his life in the process. Four others are injured.

It was past midnight , I started visiting the stupid Indian channels, but Sanjay Dutt was still ruling. They were telling how Sanjay pleaded to the court saying 'I'm the sole bread earner for my family', 'I have a daughter who is studying in US' and so on. Then they showed how Sanjay was not wearing his lucky blue shirt while he was hearing the verdict and also how he went to every temple and prayed for the last few months. A suspect in Mumbai bomb blasts, convicted under armory act...was being transformed into a हीरो
Sure Sanjay Dutt has a daughter; Sure he did not do any terrorist activity। Possessing an AK47 is considered too elementary in terrorist community and also one who possesses an AK47 has a right to possess a pistol so that again is not such a big crime; Sure Sanjay Dutt went to all the temples; Sure he did a lot of Gandhigiri but then........
Major Manish H Pitambare got the information from his sources about the terrorists' whereabouts। Wasting no time he attacked the camp, killed Hisbul Mujahidin's supremo and in the process lost his life to the bullets fired from an AK47। He is survived by a wife and daughter (just like Sanjay Dutt) who's only 18 months old. Major Manish never said 'I have a daughter' before he took the decision to attack the terrorists in the darkest of nights. He never thought about having a family and he being the bread earner. No news channel covered this since they were too busy hyping a former drug addict, a suspect who's linked to bomb blasts which killed hundreds. Their aim was to show how he defied the TADA charges and they were so successful that his conviction in possession of armory had no meaning. They also concluded that his parents in heaven must be happy and proud of him. Parents of Major Manish are still living and they have to live rest of their lives without their beloved son. His daughter won't ever see her daddy again॥

So guys, please forward this message around so that the media knows which news to give importance, as it is a shame for us since this Army Major's death news was given by a foreign TV channel!!! If you believe in it, don't feel shy in forwarding it.

Friday, August 17, 2007

మనము ఎక్కడ వున్నాము ?

నేను యం. టెక్ మహరాష్ట్ర లొ చదివే రోజు ల లో, ఒక సారి మాకు సెమిస్టర్ పరిక్ష వాయిదాపడినది అని అందరూ అనుకొంటుంటే, ఏవరు చెప్పినారు అని అడిగినాను, నోటిసు బోర్డు లొ సర్కులర్ వున్నది అనిచెప్పినారు ప్రెండ్స్. నేను వెల్లినాను సర్కులర్ చూద్దాము అని, కాని నాకు ఎక్కడా కనిపించలెదు, నేను మరలా రూము కి వచ్చి ప్రెండ్స్ తో చెప్పినాను, అక్కడ ఏమిలేదు అని, అప్పుడు వారు నాతో వచ్చి సర్కులర్ చూపించినారు, ఆశ్చర్యపొవటము నా వంతు అవినది , ఎందుకు అంటె ఆ సర్కులర్ మరాతి లో వున్నది, మా కాలేజి లొ దేశము నలు మూలల నుంచి విద్యార్దులు వచ్చి చదువుకొంటారు, అవినా మా నోటిసు బోర్డు లొ అంత ముఖ్యమైన దానిని మరాతి లొ చూపించెరు అంటె, వారు వారి భాషకు ఇస్తున్న ప్రాముఖ్యము కు నిజము గానే నామనసులొ వారిని అబినందించాను.
మనము మన భాష విసయము లో ఎక్కడ వున్నది తలుచుకొని బాద పడినాను, అప్పటినుంచి నేను మహారాష్ట్ర లొ కూడా తెలుగు లొనే మాట్లాడె వారిని, అక్కడ వారితో కూదా కొంచం కొంచం తెలుగు లొ మాట్లాడించినాను.
ఆ తరువాత నుంచి నేను తెలుగు లోనె సంతకము పెట్టటము మొదలెట్టినాను.

Thursday, August 16, 2007

నా జీవితమును మార్చిన రెండు సలహాలు

ఆ కనిపించని భగవంతుడు, తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురుదేవులు, వీరు అందరు మన జీవన గమనము లొ వివిద స్తాయిలలో మన అందరిని తీర్చి దిద్దిన వారే, వారు మన నుంచి ఒక్క ప్రేమ అనే ప్రతిపలం తప్ప ఇంక దేనిని ఆశించనివారు, ఆశించరు కూడా.
నాకు విద్యా బుద్దులు నేర్పిన, నా గురువర్యుల అందరి పేర్లు ఇక్కడ చెప్పటము సాద్యము కాదు కాబట్టి, ముందుగా వారి అందరికి పేరు పేరున పాదాభివందనములు సమర్పించుకొంటున్నాను . నేను ఈరోజు ఇలా వుండటానికి సరైన సమయము లో, సరైన సలహాలు ఇచ్చిన, శ్రీనివాసరావు మాస్ట్టరు, ఆంజనేయ మాస్ట్టరు గురించి రెండు పరిచయ వాక్యాలు చెప్పి, వారి సలహాలు నాకు ఎ విదముగా ఉపయొగపడినది చెప్పుతాను.
శ్రీనివాసరావు మాస్టరు మాకు పదివ తరగతి లొ మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పెవారు. వారు ఎంత క్లిస్టమైన లెక్క నైనా చాలా బాగా విడమరిచి అందరకి అర్ఢము అయ్యెటట్టు చెప్పెవారు. నేను పదివ తరగతి కి వచ్చినప్పుడు (a+b)2 ఫార్ములా కూడా తెలియదు, అలాంటి నన్ను ఆ సబ్జక్టు లొ మంచి ప్రావిన్యము వచ్చెటట్టు చేసినారు, అది నాకు ఆ తరువాత చదువులకు పునాది అవినది.
పదివ తరగతి చివరి పరిక్ష వ్రాసిన తరువాత , ఆ రోజు రాత్రి మా స్కూలు లొ సినిమాలు వేస్తాము, రండి అంటే మేము అంతా వెల్లినాము. ఎ రా మాధవ్ సెలవులలో ఎమి చెయ్యాలను కొంటున్నావుచెప్పు అని శ్రీనివాసరావు సార్ అడిగినారు, ఏముంది సార్, పలితాలు రాగానే ఇంటర్ లొ చేరటమే కదా, ఇంక ఎమి చేస్తాం అని అన్నాను. అంటే సెలవులలో ఏమి చెయ్యవా అని మరల అడిగినారు, నేను మరలా ఇంతకు ముందు చెప్పిన సమాదానమే చెప్పినాను. అంతకన్నా నాకు ఇంక ఎమీ తెలియదు కాబట్టి.
అప్పుడు సార్ అన్నారు, ఎ. పి. ర్. జే. సి, పాలిటెక్నిక్ రెండు వున్నవి , కోచింగ్ తీసుకొని పాలిటెక్నిక్ పరిక్ష రాయి అని అన్నారు. అప్పటి వరకు నాకు అవి వున్నవి అని కూడా తెలియదు. నేను అలానే అని చెప్పి వచ్చినాను. ఆ తరువాత వారు చెప్పినట్టుగానె పాలిటెక్నిక్ లొ కాకుండా, ఎ. పి. ర్. జే. సి కోచింగ్ తీసుకొన్నాను శ్రీ నాగభైరవ జూనియర్ కాలెజి, ఒంగోలు లొ చేరినాను. ఆంద్రుల అందాల బిడ్డ ఎన్. టి. ర్ స్వగ్రామము నిమ్మకూరులో నాకు 2nd list lo seat వచ్చినది. కాని నెను అప్పటికే శ్రీ నాగభైరవ జూనియర్ కాలెజి లొ ఇంటెర్ లొ చేరివున్నాను, అందువల్ల నిమ్మకూరు వెల్లలేదు.
ఆ రోజు సార్ సలహ నాకు ఒక మంచి కాలేజి ని పరిచయము చేసినది, ఆ కాలేజి లొ తొలినాల్లలొ నేను ఇతరుల నుంచి నెర్చుకొన్నదే నా భవితకు చక్కని మార్గము చూపినది.
ఆంజనేయ మాస్ట్టరు మాకు కెమిస్ట్రి చెప్పే వారు. వారి కోరిక ఒకటి వున్నది, అది ఏమిటంటె అతని సబ్జెక్ట్ లొ 60/60 మార్క్స్ తెప్పియాలి అని. ఆ సార్ ద్రుష్టి లొ త్వరగానే పడినాను, ఎందుకు అంటే ఆ క్లాస్ లొ కొంచము మంచిగా చదువుతున్నాను. అప్పటి నుంచి నన్ను చాలా బాగా ప్రొత్సహిస్తుండేవారు. నేను ఫైనల్ పరిక్ష లొ 60/60 మార్క్స్ తెప్పిస్తే, ఒక జత బట్టలు, షు తీసిస్తను అని చెప్పినారు. కాని నేను దానిని సాదించలేక పొయినాను, నాకు 57/60 మార్క్స్ మాత్రమే వచ్చినవి మొదటి సమత్సరము లొ.
ఇంటర్ పరిక్షలు వ్రాసిన తరువాత,నేను శ్రీ గొబిందాంబికా కాలెజ్ లొ కోచింగ్ తీసుకొన్నాను, కాని నా ద్రుష్టి అంతా మ్యాథ్స్ లేక్చరర్ కావలి అని వుండేది, ఎందుకు అంటే , మా సార్లకి అందరికి 30000 పైనే నెలకు జీతము వుండేది. అందువల్ల నేను కోచింగ్ లొ ఏమీ చదవలేదు, అప్పటికి నాకు పది వేలు రాంకు వచినది, దాని తొ ఉచిత సీటు రాదు కాబట్టి,ఉచితము అవితేనే మా ఆర్దిక పరిస్తితి సహకరిస్తుంది. నెను డిగ్రీలొ చేరుదాము అని భాపట్ల కాలేజి లొ అప్పలై చెసినాను. సీటు వచ్చినది, కాలేజి లొ చెరుదాము అని ఇంటి దగ్గర బయలు దేరి ఒంగొలు బస్ స్తాండ్ కి వచ్చినను,వచ్చినాను, అక్కడె మా కెమిస్త్రి సార్ కనపడి, ఎక్కడికి వెలుతున్నవు అని అడిగినారు, నేను కద మొత్తము చెప్పినాను, అప్పుడు ఎందుకురా నీలాంటి మంచి విద్యార్దులు కూడా మాలా అవ్వాలి అని కోరుకుంటారు, ఇక్కడ లైఫ్ లో పెరుగుదల వుండదు ఏఅమి వుండదు అని 30 నిముసాలు నాకు అక్కడె క్లాస్ తీసుకొన్నారు, అంతే నేను అక్కడి నుంచి వెనకకు వచ్చినాను బాపట్ల వెల్లకుండా. ఆ తరువాత మా ఇంటి లొ ఈ విషయము మీద చాల సీను జరిగినది అనుకొండి. ఆ తరువాత నేను లాంగ్ టరము కోచింగ్ తీసుకొని ఇంజనీరింగ్ లొ చేరినాను .
ఎది ఏమైనప్పటకి ఆ రోజు ఆ సలహాను పాటించి వచ్చినాను కాబట్టి, ఆ తరువాత ఇంజనీరింగ్, యం.టక్ రెండూ చెయ్య గలిగాను.
ఇప్పుడు జీవితములొ మంచిగానే స్తిర పడినాను అని బావిస్తున్నాను.

Wednesday, August 15, 2007

తిరుమల తిరుపతి వెంకటెశా !

తిరుమల తిరుపతి వెంకటెశా ! అని చూడగానే ఇది ఏదో ఆ తిరుమల వెంకటెశ్వర స్వామి గురుంచి అనుకోంటె మీరు పప్పు లొ కాలు పెట్టినట్టె. ఇది శ్రికాంత్, బ్రహ్మనందం కలిసి నటించిన సినిమా చూసేటప్పుడు జరిగిన సంగటన.
నేను ఆ రోజు మెస్స్ డబ్బులు కట్టటానికి Tirupati S B I నుంచి 2000 రూపాయలు తీసుకొన్నాను. ఆ తరువాత సినిమాకు వెల్లినాను, అదే పైన చెప్పిన దానికి. అక్కడ కొంత మంది నా స్నేహితులు కలిసినారు, వారితొ పిచ్చాపాటిగా మాటలాడుతూ , సినిమా టికెట్స్ తీసుకొని, ఒక పక్కగా నిలబడి మరలా కబూర్లు చెప్పుకొంటు వున్నము, అంత లొ Q- దగ్గర చిన్న గొడవ జరిగి, హాల్ మేనేజెమెంట్ ఎవరినొ కొట్టుతున్నారు, ఎదొ గొదవ అని మేము పట్టిచు కోలేదు. ఆ తరువాత కొద్దిసేపటకి ఒక అబ్బాయి మాద్దగ్గరకు వచ్చి జరిగినది చెప్పినాడు, అతను ఏవరొ కాదు , అతను కూడా మా కాల్లేజి అతనే, అతనినే వాల్లు కొట్టినది. అప్పుదు మేము అంతా వెళ్ళి హల్ వారితొ గొడవ పెట్టుకొన్నాము, మాకు అక్కడ సినిమా చూడటానికి వచ్చిన జనాలు కూడా సపొర్ట్ చెసినారు, ఆ గొడవ లొ మెము హల్ వారిలొ ఒకరిని కొట్టినము, ఆ తరువాత హల్ మేనేజెమెంట్ మాకు సారి చెప్పినారు, జరిగినదానికి. ఇంక అంతా సినిమా చూడటానికి లొనికి వెల్లినాము, సినిమ మద్యలొ జేబు మీద చెయ్యి వెస్తె, జేబు కాలిగా తగిలినది, అప్పుడు బయటకు వెల్లి వెతికినాను, ఏమి ప్రయొజనం, ఆ గొడవలొ ఏవరొ నా జేబు లొ దబ్బులు కొట్టెసినారు.
ఇక నేను ఎప్పుడన్న ఆ సంగటన మర్చిపొతానా, ఆ 2000 నా నెల కర్చులకి తీసుకొన్నవి.
అలాగె హేరాం సినిమా కి వెల్లినప్పుడు, టికెట్స్ తేవటానికి వెల్లినప్పుడు నా టైటాన్ వాచ్చి పొయినది.
ఎప్పుడు అయినా ఆ సినిమా పేరులు వింటె నాకు పట్టరాని నవ్వు వస్తుంది.

Tuesday, August 14, 2007

మరో జన్మ


నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాసేటపుడు, మాకు చివరి పరిక్షకు 5 రోజు లు విరామం వచ్చినది. అప్పుడు స్నేహితులము అందరము కలసి కళ్యాణి రిజర్వాయరు కి వెల్లినాము. కొద్దిసేపు అందరము అటు ఇటు తిరిగినాము రిజర్వాయరు మీద .అప్పుదు డ్యాము లొ దాదాపు 860 అడుగుల నీళు వున్నవి. ఆ తరువాత స్నేహితులు కొంతమంధి డ్యాము ఒడ్దున ఒక వైపు జలకాలు, ఈత కొట్టటాలు మొదలు పెట్టినారు, నాకు ఈత రాదు కాభట్టి నెను ఒడ్డున కూర్చున్నాను అందరిని తిలకిస్తున్నాను. కొంత సమయము తరువాత నా స్నేహితులు లొ ఒకరు వచ్చి నన్ను కూడా నీళ్ల లోనికి రమ్మని, నన్ను చెయ్యి పట్టుకొని వెలుతున్నాడు, నేను అతనిని వదిలించుకొని దూరముగా రొడ్దు పైకి పరిగెత్తినాను, కాని అతను నన్ను వెంభడించి పట్టుకొని,నీళ్ల లోనికి తీసుకొని పొయినాడు,షర్ట్, పాంటు విప్పి రమ్మన్నాడు, కాని నేను షర్ట్ పాంటు తోనే నీళ్ల లోనికి వెల్లినాను. వెల్లిన తరువాత చలాసేపు బాగానే గడిచినది. ఒక సారి అనుకొకుండా కాలు జారినది, నేను నీళ్ల లొ పడినాను, అప్పుడు నాకు ఎక్కడి లేని భయము వచ్చినది, ఆ భయము లొ నా కాల్లు కింద ఆనటము లేదు, స్నేహితులు ఏవరిపని లొ వాల్లు ఎంజయ్ చెస్తున్నారు, ఏవరు నన్ను చూడలెదు, చాలా సార్లు పైకి లేద్దాము అని ప్రయత్నిచాను, ఆ భయము వాల్ల నేను నా కాల్లు క్రింద పెట్ట లేక పొయినాను, అప్పటికే నీళ్లు త్రాగినాను, చివరి సారిగా మరలా ప్రయత్నించాను, అప్పుదు నా కొన వేల్లు మాత్రమే బయటకి కనపడినవి, అప్పుడు సునీల్ అనే నా స్నేహితుడు చూసి, అతను వచ్చి నన్ను పట్తుకొన్నాడు, ఆ భయము మీద నేను అతనిని గట్తిగా నా రెండు చెతులతొ పట్తుకొన్నాను, అందువల్ల అతనికి ఈత కొట్టటము సాద్యపడలెదు. అతను కూడా నాతొ పాతే నీల్ల లొనికి వస్తున్నాడు, అప్పుడు ఇంకొక స్నేహితుదు లక్ష్మి కాంత్ వచ్చి నన్ను పట్టుకొన్నాడు,ఆ భయము మీద నేను అతనిని కూడ గట్టిగా పట్తుకొన్నాను, అప్పుడు మేము ముగ్గురము నీల్ల లొనికి వెల్లుతున్నాము, అప్పుదు చంద్రశెఖర్ రెడ్ది అనె ఇంకొక స్నేహితుడు ఈత కొట్టు కొంటు మా వెనకాలకి వెల్లి నా షర్ట్ కాలర్ పట్టుకొని ముందుకు నెట్టినాడు. మిగతా స్నేహితులు గొలుసు లా ఏర్పడి మమ్మలని పట్టుకొన్నారు, ఆ తరువాత నీల్లు కక్కిచినారు.
నిజము గా నాకిది పునర్జన్మ లాంటిదె. ఆ రోజు నాకు ప్రానదానము చేసిన సునీల్,లక్ష్మి కాంత్,చంద్రశెఖర్ రెడ్ది ల సహాయము మరువలేనిది. మిమ్ము మరవను మిత్రులారా, దన్యవాదములు. ఆ షర్ట్ ని ఇప్పుటకి కూడా చాలా భద్రముగా దాచిపెట్టినా ను.
తల్లపనేని మాధవరావు

భయము అంటే తెలిసిన రాత్రి

నేను ఐంజనీరింగ్ చదివే రోజులలొ, చాలా ఎక్కువగా సినిమాలు చూసేవాడిని.నేను ఫ్రెండ్స్ తొ కలసి నరసింగాపురం లొ నివసించే వాడిని.ఆ గ్రామము లొ మేము ఒకటిన్నర సమస్త్థరములు నివసించినాము.నరసింగాపురం గ్రామం తిరుపతి కి 13 కిలొమీటర్లు దూరం లొ వుంటుంది. నరసింగాపురం గ్రామం నుంచి మా కాలేజి 3 కిలొమీటర్లు దూరం వుంటుంది. నరసింగాపురం కు రెండు మార్గలలొ చేరుకొవచ్చు. ఒకటి, మదనపల్లి రూట్ లొ వయా శ్రీనివాసమంగపురం మీదగా, ఇంకొకటి చిత్తూరు రూట్ లొ వయా చంద్రగిరి మీదగా.చంద్రగిరి నుండి నరసింగపురం కి 2 కిలొమీటర్లు వుంటుంది. ఈ మార్గమద్యము లొ సువర్ణముఖి నది పాయను, ఒక స్మశానము ను దాటి రావలియును.రాత్రి సెకండ్ షో సినిమా చుసినతరువాత నరసింగాపురం కి బసు సదుపాయం వుండదు అందువల్ల మేము చంద్రగిరి కి వచ్చి అక్కడి నుంచి మా రూం కి వెల్లేవాల్లము. ఆ మార్గము లొ మెము రాత్రిపూట చలా సారులు ప్రయానించాము, అలాగే నేను ఒక్కడిని కూడా,నేను ఏరోజు భయపడలెదు. ఎప్పటి లాగే ఒకరోజు సినిమా చూసి నేను ఒంటరిగా బయలుదెరినాను తిరుపతి నుంచి. చంద్రగిరి నుంచి ఆ రాత్రి వేల కాలి నడకన బయలుదేరినాను, సరీగా నది మద్యలొ నాలో భయము మొదలు అవినది ఎందువల్లనంటే కొంథదూరం లొ ఏదో తెల్లని ఆకారము మెరుస్తూవున్నది ,నదిని అనుకొనే రొడ్డుకు రెండు వైపుల శ్మసానము వున్నది . నా మనస్సులొ అప్పుడు ఎక్కడ లేని భయము మొదలు అవినది,అది ఎలంటి ది అంటే ఒక్క క్షనము లొ గుండె అగి పొయెటంత. వల్లు అంతా చమటలు పొసినవి, అదుగు ముందుకు పడటం లెదు,ఆ క్షనం ఏమి చెయ్యాలో ఏమి అర్దము కాలెదు, అలనె అక్కడె నిలబడి, అంజనేయ స్వామి ని తలుచుకొంటు, దాదాపు 20 నిముసాలు వున్నాను. అప్పుడు కొంచము స్థిమిథం గా ఆలొచించినాను, ఇప్పుడు నది మద్యలో వున్నాను, వెనకకు మరలి వెల్లదాము అనుకొన్నా ఆ ఆకారము రాక పోదు మన వెనకాల, ఎది అవితె అది అవుతుంది ముందుకు వెల్లతాను, ఆ భగవంతుదు వున్నాడు అని, ముందుకు భయలుదేరినాను. తీరా ఆ ఆకారం వున్న ప్రదెసం దగ్గరి కి వెల్లితే, అది ఆకారం కదు, ఒక భండకు తెల్ల కలర్ వెసి వున్నది, అప్పుడు కాని నా భయము తగ్గినది, ఆ భండను పగటిపూట చాలసార్లు చుసినాను కాని ఎరోజు అంతగ చుడలెదు దనికి ఎ కలరు వున్నది అని. నిజముగ ఆ రోజు రాత్రిని నేను జీవితం లొ మరువలెను. ఆ రోజు ఆ భగవతుడి దయ వల్ల నా గుండె ఆగలెదు కాభట్టీ అది నాకు ఒక మరుపురని రొజు కాదంటార !.